శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Lakshmi Puja : లక్ష్మీ కటాక్షం కోసం పెద్దలు సూచించిన ఆచారాలు.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెంచే సంప్రదాయాలు

    1 hour ago

    హిందూ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మీ దేవి ఐశ్వర్యం, సౌభాగ్యం, సంపదలకు అధిష్ఠాన దేవతగా భావించబడుతుంది. లక్ష్మీ అనుగ్రహం కోసం పెద్దలు సూచించిన కొన్ని ఆచారాలు నేటికీ అనేక కుటుంబాల్లో కొనసాగుతున్నాయి.

     ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను కళ్లకు దగ్గరగా తెచ్చుకుని దర్శించుకుని, ఆ తరువాత ముఖంపై రెండు అరచేతులను త్రిప్పుకోవడం శుభప్రదంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకోవాలి. పరిశుభ్రత ఉన్న చోట సానుకూల శక్తి నెలకొంటుందని విశ్వాసం.  సంధ్యాసమయానికి ముందే ఇంటి ఇల్లాలు స్నానం చేసి, దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి. ఇంట్లోని దేవతల పటాలను కుంకుమ, చందనం, పుష్పాలతో అలంకరించాలి.

     సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అలాగే ఉదయం ఇంటిని శుభ్రం చేయకుండా అల్పాహారం తీసుకోకూడదని సూచిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనికి బయటకు వెళ్లే ముందు ఇంటిని శుభ్రపరచి వెళ్లడం శుభసూచకంగా భావిస్తారు. పరగడుపున బయటకు వెళ్లాల్సి వస్తే ఒక స్పూన్ తీయని పెరుగును తీసుకుని వెళ్లడం మంచిదని ఆచారం చెబుతుంది.  ప్రతి గురువారం ఒక ముత్తైదువును ఇంటికి ఆహ్వానించి, శక్తికి తగిన దానం చేయడం ద్వారా పుణ్యఫలాలు కలుగుతాయని విశ్వాసం.

     ధన సంబంధిత వ్యవహారాలకు సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వడం శుభప్రదంగా పరిగణిస్తారు. గురువారం తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఆర్థిక సంబంధిత పనుల కోసం బయటకు వెళ్లేముందు శ్రీమహాలక్ష్మీ లేదా శ్రీ వినాయకుడును దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. శ్రీమహాలక్ష్మీదేవికి తులసి పత్రం లేదా తులసి మంజరిని సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు.

     పూజ, జపం, ధ్యానం చేసే సమయంలో తూర్పు లేదా పశ్చిమ దిశ వైపు ముఖం ఉండేలా చూసుకోవాలి.ప్రతి శనివారం ఇంట్లోని చెత్త, సాలెగూళ్లు, విరిగిపోయిన వస్తువులను తొలగించి పరిశుభ్రతను పాటించాలి.ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు చిందరవందరగా ఉంచకూడదు. గడపను లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవించాలి. గడపపై కాలు వేయడం, తొక్కడం లేదా గడపకు అటూ ఇటూ చెరో కాలు వేసి నిలబడడం వంటి పనులు చేయరాదని సంప్రదాయం చెబుతుంది. శుక్రవారం ఉదయం ఇంటి గడపలకు, తులసి కోటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా శుభశక్తులు ప్రవేశిస్తాయని విశ్వసిస్తారు.పసుపు, కుంకుమలతో అలంకరించిన గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయని పెద్దలు చెబుతారు.

    ఈ ఆచారాలు ప్రధానంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలకు సంబంధించినవి. భక్తి, పరిశుభ్రత, సత్ప్రవర్తన, కృషి మరియు ఆర్థిక క్రమశిక్షణ కలిసి ఉన్నప్పుడు కుటుంబంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు.

     

    ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Was Ahaan FaceTiming with Aneet on UK film sets? - WATCH
    తర్వాత ఆర్టికల్
    Why is stock market down today? BSE Sensex, Nifty50 crash around 1% - top reasons for fall

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి