శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Empty Stomach Mistakes: పరగడుపున ఏం తింటున్నారు? ఆరోగ్యంపై ప్రభావం చూపే కీలక అలవాట్లు

    4 hours ago

     

    ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం రోజంతా శరీర పనితీరు, శక్తి స్థాయిలు, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకునే కొన్ని ఆహారాలు, పానీయాలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం ఆహారం ఎంపిక విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.

    నిమ్మజాతి పండ్లు, గ్రీన్ టీ, టీ, కాఫీ వంటి పానీయాలను పరగడుపున తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపులో మంట, వికారం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అధిక మసాలా ఉన్న ఆహారాలు, పండ్ల రసాలు కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్ల రసాల్లో ఫైబర్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

    అయితే ఉదయాన్నే గోరువెచ్చని జీలకర్ర నీరు తీసుకోవడం మంచి అలవాటుగా భావిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలతో తయారుచేసిన తాజా రసాలు శరీరానికి అవసరమైన నీరు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

    తాజా పండ్లతో పాటు గుమ్మడి గింజలు, అవిసె గింజలు వంటి విత్తనాలను కలిపి తీసుకోవడం వల్ల పీచుపదార్థం, ఆరోగ్యకర కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే నానబెట్టిన బాదం, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్ శరీరానికి శక్తిని అందించడంతో పాటు సులభంగా జీర్ణమవుతాయి. ఇవి రోజంతా చురుకుగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

    మొలకలు, పెరుగు, పెసరట్టు, శనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. కాబట్టి ఉదయం పూట పీచుపదార్థం, ప్రోటీన్, సహజ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపవచ్చు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    DigitalPayments : యూపీఐ లావాదేవీల్లో కొత్త రికార్డు.. మే నెలలో రూ.29.9 లక్షల కోట్ల చెల్లింపులు
    తర్వాత ఆర్టికల్
    'Everyone beyond No.1 should stop playing if we are inconsistent': Chirag

    సంబంధిత లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి