శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ponnam prabhakar - పవన్‌పై పొన్నం ఫైర్.. తెలంగాణ ఎవరి జాగీరు కాదని ఘాటు వ్యాఖ్యలు

    1 గంట క్రితం

     

    తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు అని, అది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేన అధినేత మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించిన మంత్రి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. గద్దర్‌కు కారు కొనిచ్చానని చెప్పిన అంశంపై ముందుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను గౌరవిస్తూనే ఉంటారని, ప్రాంతీయ విద్వేషాలకు ఇక్కడ స్థానం లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా ప్రజలపై ఎలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, కొండగట్టు అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎవరి జాగీరు కాదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన మంత్రి, ఆయన సభలకు జనాలు వచ్చినా అది ఓట్లుగా మారదని ఎద్దేవా చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Tennis legend Serena Williams' $10 million Florida mansion is a luxury retreat with a secret karaoke room, infinity pool but no tennis court
    తర్వాత ఆర్టికల్
    SRK was hesitant to buy KKR, said Rs 20 cr was a huge part of his savings

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి