శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Ys Jaganmohanreddy : ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కావడం బాధాకరం.. పేదల వైద్య హక్కులు దెబ్బతింటున్నాయి: జగన్

    1 hour ago

    ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddy ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయనను కలిసిన పలువురు వైద్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స పొందాల్సిన వేలాది మంది రోగులు సేవలకు దూరమవుతున్నారని, ఎల్వోసీల మంజూరులో పారదర్శకత లేకపోవడంతో పాటు కొన్ని ఆసుపత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా స్పందించిన జగన్, దివంగత నేత Y. S. Rajasekhara Reddy పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనపరచడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Crew member dies on ‘Killer’ set after blast
    తర్వాత ఆర్టికల్
    Maruti Suzuki Sees 40 Per Cent Jump In CNG Bookings, Says Partho Banerjee

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి