శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    fifa world cup 2026 : ఫుట్‌బాల్ మహాసంగ్రామంలో భారత మూలాల స్టార్‌లు.. వరల్డ్‌కప్‌లో ప్రత్యేక ఆకర్షణ

    48 నిమిషాలు క్రితం

    ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇంకా కలగానే ఉన్నప్పటికీ, ఈసారి ప్రపంచకప్ వేదికపై భారత మూలాలు కలిగిన నలుగురు ఆటగాళ్లు కనిపించనున్నారు. వారిలో న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న Sarpreet Singh ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పంజాబీ మూలాలు కలిగిన సర్ప్రీత్ సింగ్ 2018లో ముంబైలో జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో భారత జట్టుపై ఆడి, ఒక గోల్‌తో పాటు రెండు అసిస్టులు నమోదు చేసి గుర్తింపు పొందారు. అనంతరం 2019లో FC Bayern Munich తరఫున బుండెస్లిగాలో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.

     

    27 ఏళ్ల ఈ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ జర్మనీ, పోర్చుగల్, సెర్బియా లీగ్‌లలో రాణించిన తర్వాత ప్రస్తుతం న్యూజిలాండ్ క్లబ్ తరఫున ఆడుతున్నారు. గాయంతో కొంతకాలం దూరమైనప్పటికీ తిరిగి ఫిట్‌నెస్ సాధించి న్యూజిలాండ్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటివరకు 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్ చేసిన సర్ప్రీత్ సింగ్, భారత మూలాల ఆటగాళ్లు ప్రపంచ ఫుట్‌బాల్‌లో తమ ముద్ర వేస్తున్నారనే విషయాన్ని మరోసారి చాటిచెబుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Madhuri Dixit reveals how Dr Nene has adapted to life in India after moving from US
    తర్వాత ఆర్టికల్
    'Ek bihari, sab pe bhari': Sooryavanshi receives Virat Kohli's special praise

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి