శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    DonaldTrump : భారత్ సహా 60 దేశాలపై కొత్త సుంకాలకు అమెరికా సిద్ధం.. వాణిజ్య రంగంలో మరోసారి ఉద్రిక్తతలు

    1 hour ago

     

    అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రభుత్వం మరోసారి సుంకాల (టారిఫ్‌లు) అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను అరికట్టడంలో విఫలమయ్యాయనే ఆరోపణలతో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్ సహా 60కి పైగా దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం (USTR) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    ఇదే సమయంలో అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం ప్రస్తుతం న్యూఢిల్లీ పర్యటనలో ఉంది. భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. మార్కెట్ యాక్సెస్, పెట్టుబడులు, కస్టమ్స్ సౌలభ్యం, ఆర్థిక భద్రత వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయి. ఒకవైపు సుంకాల ప్రతిపాదన, మరోవైపు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతుండటంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    INDvsNZ CricketSeries : 100 ఏళ్ల బంధానికి గుర్తుగా భారత్-న్యూజిలాండ్ మెగా సిరీస్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌ల క్రికెట్ జాతర!
    తర్వాత ఆర్టికల్
    Gold Silver Rate Today (June 3): Prices Tank, Check Latest Rates In Delhi, Mumbai, Chennai, More

    సంబంధిత అంతర్జాతీయం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి