శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Illegal soil excavation : కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తొలకాలు

    3 వారాలు క్రితం

    కైకలూరు / కలిదిండి:
    కైకలూరు నియోజకవర్గం పరిధిలోని కలిదిండి మండలంలో అనధికార మట్టి తొలకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోరుకొల్లు, కలిదిండి, గుర్వాయపాలెం గ్రామాల నుంచి ఎటువంటి మైనింగ్ అనుమతులు, భూమి మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) లేకుండానే భారీగా మట్టి తరలింపు జరుగుతుండటం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రధాన రహదారుల మీదుగా రోజంతా ట్రాక్టర్లు రై రై అంటూ మట్టి తరలిస్తున్నా సంబంధిత రెవిన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు ఇంటి అవసరాల కోసం కొద్దిపాటి మట్టిని తీసుకెళ్లాలంటే అనేక నిబంధనలు, అనుమతులు తప్పనిసరి చేస్తూ, ఇదే అధికారులు భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ మట్టి వ్యాపారాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

    ప్రభుత్వ పనిదినాల్లో తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ట్రాక్టర్లు తిరుగుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం, ఇక పండుగ సెలవుల సమయంలో మూడు రోజుల పాటు పూర్తిగా నియంత్రణ లేకుండా అక్రమ మట్టి తరలింపు సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీని వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో మైనింగ్‌పై నియంత్రణ లేకుండా టిప్పర్ల ద్వారా మట్టి తరలింపులు సాగాయని, అప్పట్లో రాజకీయ నాయకుల అండదండలతో అక్రమాలు జరిగినట్టు ప్రజలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోయేలా ఇలాంటి అక్రమాలు ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నాయన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

    ఒకవైపు స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంటే, మరోవైపు గ్రౌండ్ లెవెల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో “పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చాక కాసులకే ప్రాధాన్యం” అన్న భావన బలపడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజల్లో పాలనపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kriti Sanon turns DJ at sister Nupur Sanon and Stebin Ben’s wedding
    తర్వాత ఆర్టికల్
    Gudivada MLA Venigandla Ramu :

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి