శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Fake Cbi Logo : డిజిటల్ స్కామ్ కేంద్రాలపై కంబోడియా ఉక్కుపాదం… భారత చిహ్నాలతో మోసాలు

    14 hours ago

     కంపోట్: ఆన్‌లైన్ ద్వారా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న డిజిటల్ స్కామ్ కేంద్రాలపై కంబోడియా ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గత ఏడాది నుంచి కొనసాగుతున్న ఏరివేతల్లో భాగంగా తాజాగా సుమారు 200 డిజిటల్ స్కామ్ కేంద్రాలపై దాడులు నిర్వహించగా, అందులో 190 కేంద్రాలను మూసివేసినట్లు కంబోడియా సీనియర్ మంత్రి చాయ్ సినారిథ్ వెల్లడించారు.

    వియత్నాం సరిహద్దు సమీపంలోని కంపోట్ ప్రావిన్స్ లో ఉన్న ఒక కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేయగా అక్కడి ఏర్పాట్లు చూసి షాక్‌కు గురయ్యారు. భారతీయ త్రివర్ణ పతాకం, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలు, ముంబై పోలీస్ లోగో, సీబీఐ గుర్తులు, భారతీయ పోలీసు యూనిఫామ్‌లు ఏర్పాటు చేసి నకిలీ పోలీస్ స్టేషన్ మాదిరిగా రూపొందించినట్లు గుర్తించారు. “డిజిటల్ అరెస్టు” పేరుతో బెదిరించి బాధితుల నుంచి భారీ మొత్తాలు దోచుకునే విధంగా వ్యవస్థను నడిపిస్తున్నట్లు తేలింది.

    ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 173 మందిని అరెస్ట్ చేయగా, సుమారు 11,000 మంది కార్మికులను డిపోర్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఫోన్ కాల్స్ చేసేందుకు ప్రత్యేక స్టూడియో బూత్‌లు, బాధితులను ఎలా మోసం చేయాలన్న దానిపై సూచనలతో డాక్యుమెంట్లు, విస్తృత కంప్యూటర్ సెటప్‌లు అక్కడ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    ఈ స్కామ్‌ల వెనుక చైనాకు చెందిన లీ కువాంగ్ అనే వ్యాపారవేత్త సూత్రధారి అని అనుమానిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయడంతో కొందరు పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో కష్టాలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. గతంలో థాయ్‌లాండ్ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో కూడా ఇలాంటి నకిలీ పోలీస్ స్టేషన్‌లను గుర్తించినట్లు సమాచారం. వివిధ దేశాల చిహ్నాలను వాడుకుని అంతర్జాతీయ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్న ఈ నెట్‌వర్క్‌పై కంబోడియా ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: Mosca duo lay strong platform for Italy against Nepal
    తర్వాత ఆర్టికల్
    Chris Hemsworth reveals he bribed daughter India Rose on set

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి