శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Deputy CM Pawan Kalyan :

    1 వారం క్రితం

     ధర్మ పరిరక్షణ సాధ్యమని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర నాందేడ్‌లో నిర్వహించిన శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

     

    తనది కాని ధర్మం కోసం తన శిరస్సునే త్యాగం చేసిన మహానుభావుడు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, అందుకే చరిత్ర ఆయనను “ధర్మ్ ది చాదర్ – హింద్ ది చాదర్”గా కీర్తిస్తోందన్నారు. ఆయన బలిదానం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదని, ప్రతి మనిషి వివేకానికి పరీక్షగా నిలిచిన ఘటన అని వ్యాఖ్యానించారు.

     

    1675 నవంబర్ 24న ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద జరిగిన ఈ బలిదానం నేటి పొరుగు దేశాల్లో హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తోందని అన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ జీ త్యాగం మనందరికీ ఒక హెచ్చరికగా నిలుస్తోందని, ప్రతి పౌరుడు ధర్మాన్ని హక్కుగా కాకుండా *బాధ్యతగా* స్వీకరించాలని పిలుపునిచ్చారు.

     

    దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలని, నిజమైన బలం ఆధిపత్యంలో కాకుండా పరోపకారంలో ఉంటుందని మహారాష్ట్ర నేల చాటి చెప్పిందన్నారు.

     

    చత్రపతి శివాజీ నుంచి సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్, మహాత్మా జ్యోతీబా పూలే, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు అనేక మహనీయులను దేశానికి అందించిన నేల మహారాష్ట్ర అని గుర్తుచేశారు. సామర్థ్యంతో పాటు సద్భావన కూడా అవసరమని దేశానికి బోధించిన నేల ఇదేనన్నారు.

     

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 2047 వికసిత్ భారత్ విజన్ కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదని, సంస్కృతి–సంప్రదాయాలు, సామాజిక నిబద్ధత కూడా భాగమని తెలిపారు. యువత భాగస్వామ్యం లేకుండా ఆ లక్ష్యం సాధ్యం కాదన్నారు.

     

    చాందినీ చౌక్‌లో శ్రీ గురు తేగ్ బహదూర్ జీ ఎలా వృక్షంలా నిలిచారో, భారతదేశ సార్వభౌమాధికార పరిరక్షణ కోసం మనమంతా వటవృక్షంలా నిలబడుదాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

     

    ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, సిక్కు మత పెద్దలు, వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Top stocks to buy or sell today: Stock market recommendations for January 27, 2026 - check list
    తర్వాత ఆర్టికల్
    ‘Just getting started’: Hardik Pandya shares nostalgic video on 10-year India journey

    సంబంధిత జాతీయ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి