శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    YSRCP Stands For Muslim Rights : ఆంజుమన్ ఆస్తుల స్వాధీనంపై వైఎస్సార్‌సీపీ నిరసన

    1 రోజు క్రితం

    గుంటూరు :
    ఆంజుమన్ ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కలెక్టర్‌కు అందజేసి, ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వంలో జరగగా, కులాలకు–మతాలకు అతీతంగా అందరూ నల్ల దుస్తులు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

     

    ఈ నిరసనలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, మంగళగిరి ఇంచార్జ్ వేమారెడ్డి, తాడికొండ ఇంచార్జ్ బాల వజ్రబాబు, మాజీ వఖ్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా, గుంటూరు జిల్లా మైనారిటీ అధ్యక్షులు సైదా ఖాన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మైనారిటీ హక్కులను హరించే చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    India Open stays despite criticism as BWF releases revamped schedule
    తర్వాత ఆర్టికల్
    ​Where to watch: Sonam Kapoor’s powerful performances on OTT

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి