శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    YSRCP attack on the media : మీడియాపై వైసీపీ దాడి… బయటపడ్డ కురసాల ఆరాచక వైఖరి

    3 weeks ago

    కాకినాడ (తొలి ఉదయం):
    మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు వైసీపీ పాలనలో కొత్తవి కాకపోయినా, ఈసారి మాత్రం హద్దులు దాటాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నించే పెన్నుపై పిడికిలి ఎత్తడం, నిజాన్ని రాసే జర్నలిస్టుపై దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్య సమాజం తలదించుకునే స్థాయిలో జరిగిందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాకినాడ రూరల్‌లో సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ అధ్యక్షుడు వీవీఎస్ ప్రకాశ్ రావుపై వైసీపీ అనుచరులు చేసిన దాడి ప్రజాస్వామ్యంపై చేసిన నేరంగా అభివర్ణిస్తున్నారు. ఇది వ్యక్తిగత ఘర్షణ కాదని, మీడియాను భయపెట్టి మౌనంగా మార్చాలన్న వైసీపీ రాజకీయ అహంకారానికి ప్రతిరూపమని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.

    మాజీ మంత్రి, ప్రస్తుత ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో పాత్రికేయ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. సమావేశానికి వెళ్లిన జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని, స్థల వివాదం పేరుతో రెచ్చగొట్టే ధోరణిలో కన్నబాబు సోదరుడు కురసాల కళ్యాణకృష్ణ వ్యవహరించాడన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ రెచ్చగొట్టుడి కొనసాగింపుగానే వైసీపీ కార్యకర్త కొప్పిశెట్టి రమణశ్రీతో పాటు మరొకరు కలిసి సీనియర్ జర్నలిస్టుపై దాడి చేశారన్న భావన బలంగా వ్యక్తమవుతోంది.

    ఇంతటి ఘోరమైన ఘటన అనంతరం మాజీ మంత్రి కన్నబాబు స్పందించిన తీరు మరింత దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత జర్నలిస్టులు విషయం వివరించేందుకు ప్రయత్నించినప్పుడు “మీకు ఇష్టం వచ్చినది చేసుకోండి, దిక్కున్నచోట చెప్పుకోండి” అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీడియాపై దాడిని ఖండించాల్సిన మాజీ జర్నలిస్ట్, ప్రజాస్వామ్య విలువలపై నిలబడాల్సిన మాజీ మంత్రి, అనుచరుల దాష్టికాన్ని పరోక్షంగా సమర్థించినట్టేనని ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    దాడి అనంతరం జర్నలిస్టులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం, ఆపై స్టేషన్ ఎదుట మౌనదీక్ష చేపట్టడం జర్నలిస్టుల సహనానికి వచ్చిన తుదిమెట్టు అని విశ్లేషకులు అంటున్నారు. “ప్రశ్న అడిగితే కొడతారా? నిజం రాస్తే బెదిరిస్తారా? ఇదేనా రాజకీయ సంస్కృతి?” అనే ప్రశ్నలు ఈ ఘటనతో మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.

    పెన్ను పట్టిన చేతిపై దాడి చేయడం ద్వారా ప్రజల గొంతును నొక్కగలమని భావించడం అతి పెద్ద భ్రమ అని, మీడియాను భయపెట్టి పాలించవచ్చన్న అహంకారం చివరికి ప్రజల తిరస్కారానికే దారి తీస్తుందని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ దాడి ఒక్క వ్యక్తిపై మాత్రమే కాదు, స్వేచ్ఛాయుత మీడియాపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని దాడులకు ఇది దారితీసే ప్రమాదం ఉందని, రాజకీయ నేతల నిర్లక్ష్యం–అనుచరుల దాష్టికం కలిసినప్పుడు ప్రజాస్వామ్యం ఎలా నలిగిపోతుందో చూపించే ఉదాహరణగా ఈ ఘటన నిలుస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026: Will old income tax regime be discontinued leaving new regime as the only option?
    తర్వాత ఆర్టికల్
    MI vs GG, WPL Live: Gujarat in rebuild mode following loss of Devine, Mooney

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి