శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    YS Jagan–Ambati Rambabu Meeting in Tadepalli : తాడేపల్లిలో వైయస్‌ జగన్–అంబటి రాంబాబు భేటీ

    17 hours ago

    తాడేపల్లి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ను తమ నివాసంలో కలిసిన గుంటూరు జిల్లా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పటికే అక్రమ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న రాంబాబు, తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు, తన ఇంటిని ధ్వంసం చేసిన రౌడీ మార్గాలు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్‌ యాక్షన్ వంటి అంశాలను వైయస్‌ జగన్‌కు వివరించారు. వైయస్‌ జగన్ రాంబాబుకు, తప్పుడు కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కోవచ్చని భరోసా ఇచ్చారు.

    వైయస్‌ జగన్, అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరుపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, పార్టీ నాయకులు మరియు క్యాడర్ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు. ఈ సందర్బంగా వైయస్‌ జగన్‌ను కలిసినవారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Cillian Murphy’s Top OTT Dramas: ‘Normal People’ to ‘Peaky Blinders’
    తర్వాత ఆర్టికల్
    India-US sign Pax Silica Declaration: New Delhi’s entry ‘strategic and essential’

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి