శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    young actress Divya bharathi : ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్… కుర్రకారును ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా

    9 గంటలు క్రితం

    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఒకప్పుడు గుర్తింపు రావాలంటే నాలుగు, ఐదు సినిమాలు చేయాల్సి వచ్చేది. కానీ కాలం మారింది. ఇప్పుడు ఒక్క సినిమాతోనే, కొన్ని సందర్భాల్లో ఒక్క సాంగ్‌తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు కొందరు హీరోయిన్లు.  అలాంటి కోవకు చెందిన లేటెస్ట్ సెన్సేషన్ ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతోనే కాదు… నిజానికి ఒక్క పాటతోనే కుర్రకారును తన వెంట తిరిగేలా చేసుకుంది. “ఏం వయ్యారం రా బాబు” అంటూ యువత నోరెళ్లబెట్టేలా చేసిన ఈ అందగత్తె ఎవరో గుర్తుపట్టారా?

     

    ఆమె ఎవరో కాదు… దివ్య భారతి.

     

    పై ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ తన అందం, వయ్యారాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పటివరకు దివ్య భారతి చేసింది కేవలం ఒక్క సినిమా మాత్రమే. తమిళ్‌లో జీవి ప్రకాష్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్‌లో గ్లామర్ డోస్ ఎక్కువగా చూపించి యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ పాట భారీగా పాపులర్ అయింది. ఆ సాంగ్‌లో లిప్‌లాక్ సీన్స్‌తో దివ్య భారతి చేసిన హాట్ పెర్ఫార్మెన్స్ అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె అందానికి, వయ్యారాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

     

    ఆ తర్వాత మరోసారి జీవి ప్రకాష్‌తో కలిసి ‘కింగ్‌స్టన్’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  ఇక సోషల్ మీడియాలో దివ్య భారతి ఫుల్ యాక్టివ్. రెగ్యులర్‌గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె హాట్ ఫోటోలకు కుర్రకారు “హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అందాలతో గత్తరలేపుతూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Arijit Singh returns to the stage post playback retirement
    తర్వాత ఆర్టికల్
    T20 WC: USA draw first blood with Saim Ayub’s dismissal

    సంబంధిత నమస్తే సోదరా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి