శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Yogi Vemana Jayanti : యోగి వేమన జయంతి: ప్రజాకవి నీతి బాట నేటి సమాజానికి మార్గదర్శకం – సీఎం చంద్రబాబు నాయుడు

    2 weeks ago

    అమరావతి:
    ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కుల, మత భేదాలు మరియు మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ సమాజాన్ని జాగృతం చేయడంలో యోగి వేమన చేసిన కృషి ఈనాటికీ ఎంతో ప్రాసంగికమని సీఎం పేర్కొన్నారు. యోగి వేమన తన పద్యాల ద్వారా మానవత్వం, సమానత్వం, నీతి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. “విశ్వదాభిరామ వినురవేమా” అంటూ వేమన చెప్పిన నీతి సూత్రాలు నేటి సమాజం తప్పక అనుసరించాల్సినవేనని ఆయన అభిప్రాయపడ్డారు.

     

    యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపించుకునే అవకాశాన్ని కల్పించినట్లవుతుందని సీఎం తెలిపారు. యువత ముఖ్యంగా వేమన బోధనల నుంచి స్ఫూర్తి పొంది, సమాజ హితానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. యోగి వేమన ఆలోచనలు కాలాతీతమైనవని, సమాజ సంస్కరణకు అవి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    A wedding invitation to the clouds: Inside India’s frog marriages
    తర్వాత ఆర్టికల్
    Is ‘His & Hers’ coming back for Season 2?

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి