శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహిమ – పేరు పలికితే రోగాలు పరార్!

    18 hours ago

    “వైద్యో నారాయణో హరిః” అని శాస్త్రవాక్యం. వైద్యుడు నారాయణుడితో సమానమని దాని అర్థం. సృష్టిలోనే మహా వైద్యుడు శ్రీమహావిష్ణువే. తనలోని ఆ దివ్య వైద్య శక్తిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో కొలువై ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి...  స్వామివారి మహిమలు భక్తుల్ని ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటున్నాయి.

    రోగ నివారణకు ప్రసిద్ధి

    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని భక్తితో దర్శించిన వారికి కుదరని రోగం ఉండదనే నమ్మకం ఎంతో బలంగా ఉంది. స్వామి భక్తుల కలల్లో ప్రత్యక్షమై వ్యాధులను నయం చేస్తారన్న విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి దీక్షలు తీసుకుని, మొక్కులు పెట్టుకుని ఉపశమనం పొందిన అనుభవాలను పంచుకుంటుంటారు.

    నృసింహ పుష్కరిణి మహత్యం

    యాదగిరి గుట్టపై ఉన్న నృసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తవ్వించాడని, ఈ పుష్కరిణికి వ్యాధులను నయం చేసే దివ్యశక్తి ఉందని Skanda Puranaలో ప్రస్తావించబడింది. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదవ మహర్షికి మహావిష్ణువు ప్రత్యక్షమై మూడు అంశాలతో దర్శనం ఇచ్చాడని పురాణగాథ చెబుతోంది.

    మూడు నరసింహ స్వరూపాలు

    యాదవ మహర్షి ప్రార్థనతో స్వామి మూడు విభిన్న రూపాల్లో దర్శనమిచ్చాడు –

    గండభేరుండ నరసింహ

    జ్వాలా నరసింహ

    యోగానంద నరసింహ

    గర్భగుడిలో జ్వాలానరసింహ, యోగానంద నరసింహమూర్తులు కొలువై ఉండగా, ఆలయ పరిసరాల్లో గండభేరుండ నరసింహమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామికి ఐదు ముఖాలు ఉండటం విశేషం. అందులో ఒకటి సింహరూపం కావడం ఆలయ ప్రత్యేకతను మరింతగా చాటుతోంది.

    ఆధ్యాత్మిక వైభవం

    యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ప్రత్యేకత ఏమిటంటే – స్వామి ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తులకు కరుణామయుడిగా, వైద్యస్వరూపుడిగా దర్శనమిస్తాడనే విశ్వాసం. రోగాలు, దోషాలు, కష్టాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారు.   భక్తిశ్రద్ధలతో స్వామిని స్మరించిన ప్రతి హృదయంలో ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మిక శాంతి నిండాలని కోరుకుంటూ… “లక్ష్మీనరసింహ స్వామికి జై!”

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Ready-to-move vs under-construction homes: Which is the better investment
    తర్వాత ఆర్టికల్
    DYK Rajpal Yadav has served 3 months in jail before?

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి