శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Y. S. Sunitha Reddy : వివేకా హత్యకేసు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోండి: యూసీఐఎల్‌కు సునీత లేఖ

    9 hours ago

    Y. S. Vivekananda Reddy హత్యకేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి కుమార్తె Y. S. Sunitha Reddy యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ జీఎం సుమన్ సర్కార్‌కు లేఖ రాశారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తిని మళ్లీ విధుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన ఆమె, శాఖాపరమైన దర్యాప్తును తక్షణమే పూర్తి చేసి సస్పెన్షన్, క్రమశిక్షణా చర్యలపై 15 రోజుల్లో లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేయడంలో 11 నెలల జాప్యం ఎందుకు జరిగిందో విచారణ జరపాలని, ఏప్రిల్ 2023 నుంచి చేసిన చెల్లింపులపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహించాలని కూడా కోరారు. సీబీఐ అధికారిపై చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ జరగాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

     

    ఈ అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన సునీత, సుమారు 500 రోజులు జైలులో ఉన్న వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Uranium Corporation of India Limited ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇంత కాలం జైలులో ఉంటే ఏ రకమైన సెలవు మంజూరు చేశారో స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించిన సునీత, అవసరమైతే విజిలెన్స్, న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naiduను కలిసి వివరిస్తానని తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kani Kusruti discusses portraying trauma in 'Assi'
    తర్వాత ఆర్టికల్
    Wake-up call for individual taxpayers! Foreign assets reporting in focus - what you should know

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి