శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Visakha Utsav 2026 : అట్టహాసంగా ప్రారంభమైన విశాఖ ఉత్సవ్–2026

    1 week ago

    విశాఖపట్నం:

    ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహిస్తున్న **విశాఖ ఉత్సవ్–2026** శనివారం ఆర్కే బీచ్ వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘సాగరం నుండి శిఖరం వరకు’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కలిసి అధికారికంగా ప్రారంభించారు.

     

    ఉత్సవాల్లో భాగంగా తొలుత నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రులు స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన కార్నివాల్, ఉత్తరాంధ్ర జానపద కళారూపాల ప్రదర్శనలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి.

     

    ఈ ఏడాది విశాఖ ఉత్సవాల్లో **హెలికాప్టర్ రైడ్స్, పారా గ్లైడింగ్, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశం నుంచీ విశాఖ నగర సౌందర్యాన్ని వీక్షించిన పర్యాటకులు పులకించిపోయారు. సముద్ర తీరంలో పర్యాటకుల కేరింతలు ఉత్సవాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

     

    ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బాణసంచా ప్రదర్శన ఆకాశాన్ని రంగుల విందుగా మార్చింది. ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా రూపొందించారు.

     

    కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ యాంకర్ సుమ మంత్రి కందుల దుర్గేష్‌ను ‘సహృదయులు’ అని సంబోధించడంతో సభా ప్రాంగణం మొత్తం ఈలలు, కేకలతో మారుమోగింది. స్థానిక కళాకారులకు ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.

     

    ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే విశాఖ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ప్రజలందరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ‘So real’: Anupam Kher shares details of ‘accidental’ meeting with Rohit Sharma
    తర్వాత ఆర్టికల్
    Meet the Japanese woman who has worked for 65+ years at the same job

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి