శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    virllapadu : పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వ భరోసా– ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

    6 రోజులు క్రితం

    ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి ప్రాధాన్యం 

    వీర్లపాడు, జనవరి 31 (తొలి ఉదయం):
    ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల సంక్షేమానికి పెద్ద ప్రాధాన్యం ఇస్తూ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం అందించి భరోసా కల్పించిందన్నారు.

    గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన హెల్త్ సెంటర్ల నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు.

    ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ

    శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Sugar Season 2': Colin Farrell returns, case turns personal
    తర్వాత ఆర్టికల్
    Smokers To Pay More: Excise Duty Up To Rs 8.50 Per Stick On Cigarettes From Feb 1

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి