శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Vinayaka Puja : గరికె, తెల్లజిల్లేడు, పాలవెల్లి – వినాయక పూజలోని ఆధ్యాత్మిక రహస్యాలు

    17 hours ago

    వినాయక పూజలో గరికె (దూర్వాయుగ్మం)కు ప్రత్యేక స్థానం ఉంది. గరికె దర్భల జాతికి చెందినది. దర్భలు శ్రీమహావిష్ణువు రోమకూపాల నుండి జన్మించాయని, అమృతస్పర్శకు నోచుకున్నాయని పురాణ విశ్వాసం. అందువల్ల అవి అత్యంత పవిత్రమైనవి. గరికెకు పూలు పూయవు; ప్రకృతి సంబంధమైన పరాగసంపర్క దోషం ఉండదు. అవి స్వయంభువాలుగా భావించబడతాయి. సంపర్క దోషం లేకుండా పార్వతీదేవికి స్వయంభువుడిగా జన్మించిన వినాయకునికి గరికె అంతగా ఇష్టమవడం ఇదే కారణం. అందుకే ఆయన దూర్వాయుగ్మ పూజను పరమ ప్రీతితో స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతాయి.

    అలాగే తెల్లజిల్లేడుమొక్కకు కూడా విశిష్ట పవిత్రత ఉంది. మారేడుచెట్టు శివునికి, రావిచెట్టు విష్ణువుకు, తులసి మహాలక్ష్మికి, వేప మహాశక్తికి ప్రతిరూపాలుగా భావించబడినట్లే, తెల్లజిల్లేడు సాక్షాత్తు వినాయకునికి ప్రతిరూపమని విశ్వాసం. వంద సంవత్సరాలు బ్రతికిన తెల్లజిల్లేడుమొక్క వినాయకుని ఆకృతిని సంతరించుకుంటుందని, అందులో వినాయకుడు శాశ్వతంగా నివసిస్తాడని పురాణ భావన. అందుకే ఆ మొక్కను పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు.

     

    పాలవెల్లి కట్టే సంప్రదాయం కూడా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. పాలవెల్లి లేదా పాలపుంత అనేది అంతరిక్షంలోని గ్రహ-నక్షత్ర సముదాయానికి ప్రతీక. పాలవెల్లికి కట్టే రకరకాల ఫలాలు, పుష్పాలు ఆ గ్రహ నక్షత్రాలకు ప్రతిరూపాలు. సమస్త సృష్టికి ఆదినాయకుడు వినాయకుడే అనే భావాన్ని తెలియజేయడానికే ఈ పాలవెల్లి సంప్రదాయం ఏర్పడింది. అందుకే పెద్దలు “ప్రకృతి సంపర్కంతో పుట్టిన పూలకంటే, మనసులో పుట్టిన మనోపుష్పాన్ని భగవంతునికి అర్పించాలి” అని ఉపదేశించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    TOI Exclusive | Coming soon: A rebel wrestling league by the rebels
    తర్వాత ఆర్టికల్
    5 ways to help a partner who is dealing with depression

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి