శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Varun Chakaravarthy Creates Record : వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్.. వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు!

    8 hours ago

    Varun Chakravarthy మరోసారి తన మిస్టరీ స్పిన్‌తో చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఈ స్టార్ స్పిన్నర్, నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు. పవర్ ప్లేలో మాక్స్ ఓ డౌడ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా వరుసగా 17వ మ్యాచ్‌లో వికెట్ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు వరుణ్ మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

     

    ఇదివరకు ఈ రికార్డు Arshdeep Singh పేరిట ఉంది. జూన్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు వరుసగా 17 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ సాధించిన అర్ష్‌దీప్ రికార్డును వరుణ్ సమం చేశాడు. 2025 నుంచి నెదర్లాండ్స్ మ్యాచ్ వరకు వరుసగా 17 మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన వరుణ్, ఈ వ్యవధిలో మొత్తం 31 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో Ashish Nehra ఉన్నాడు. నెహ్రా వరుసగా 13 మ్యాచ్‌ల్లో వికెట్ సాధించిన ఘనత సాధించాడు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    US trade gap widens as goods deficit hits record $1.24 trillion in 2025
    తర్వాత ఆర్టికల్
    How a Taj-Mahal inspired private residence in Madhya Pradesh became an Internet sensation; a 'real' estate love story

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి