శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    UIDAI Launches New Aadhaar App : కొత్త ఆధార్ యాప్‌తో అడ్రస్ మార్పు సులభం

    22 hours ago

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కొత్త ఆధార్ యాప్‌ ద్వారా ఆధార్‌లోని వివరాలను అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభమైంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో లాంచ్ చేసిన ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ రూపొందించిన ఈ అధికారిక యాప్‌లో ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఎం-పిన్ లేదా ఫేస్ రికగ్నిషన్ సెట్ చేసుకోవచ్చు. యాప్‌లోని ‘సేవలు’ విభాగంలోకి వెళ్లి ‘చిరునామా అప్‌డేట్’ ఎంపికను ఎంచుకుని అవసరమైన అడ్రస్ ప్రూఫ్ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసి రూ.75 రుసుమును డిజిటల్ విధానంలో చెల్లిస్తే, యూఐడీఏఐ వివరాలను పరిశీలించి ఆమోదిస్తే కొత్త ఆధార్ కార్డు పోస్టు ద్వారా పంపుతుంది.

    ఇప్పటి వరకు ఆధార్ వివరాలు మార్చుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప ఆధార్ సెంటర్‌ను సందర్శించాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాల కొరతతో ప్రజలు పట్టణాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొత్త యాప్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు మొబైల్ ద్వారానే సులభంగా అడ్రస్ అప్‌డేట్ చేసుకునే వీలు కలిగింది. దీంతో సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Rajpal Case LIVE Updates: Delhi HC to hear his bail plea
    తర్వాత ఆర్టికల్
    Curiosity Corner: How many stars are there in the universe?

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి