శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tushar Gandhi గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై తుషార్ గాంధీ ట్వీట్.. రాజకీయ చర్చకు దారి

    1 hour ago

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌పై Tushar Gandhi చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం స్థానికుల ఇళ్లను కూల్చివేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మా Mahatma Gandhi ఆశయాలకు ఇది విరుద్ధమని తుషార్ గాంధీ పేర్కొన్నారు. “గాంధీజీ బతికి ఉంటే తన పేరు మీద, తన విగ్రహం కోసం పేదల ఇళ్లను కూల్చొద్దని చెప్పేవారు” అంటూ ట్వీట్ చేశారు. విగ్రహాల కంటే పేద ప్రజల కనీస అవసరాలే గాంధీజీకి ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.

     

    మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపడుతున్న నేపథ్యంలో, గాంధీ విగ్రహం కోసం ఇళ్లను తొలగించడం గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంటూ ముఖ్యమంత్రి A. Revanth Reddyకు విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా పరిమిత స్థాయిలోనే భూములు సేకరిస్తామని స్పష్టం చేసింది. గతంలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సుమారు 3200 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని, సుమారు 10 వేల నిర్మాణాలే ప్రభావితం అవుతాయని తెలిపింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం లక్షన్నర కుటుంబాలు ప్రభావితమవుతాయని ఆరోపిస్తున్నాయి. రూ.1.5 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఒకవైపు అభివృద్ధి వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు గాంధేయ విలువలు, పేదల నివాస హక్కుల పరిరక్షణ అంశాలు ప్రధాన చర్చగా మారాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Free LPG Cylinder Benefit This Holi For Eligible Residents - Check Details
    తర్వాత ఆర్టికల్
    PAK vs ENG Live: Shaheen Afridi removes Phil Salt for a duck

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి