శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    TS PGECET 2026 నోటిఫికేషన్ విడుదల

    2 hours ago

    తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2026 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను ఈసారి కూడా Jawaharlal Nehru Technological University Hyderabad ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందులో సాధించిన ర్యాంకుల ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

    అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కోర్సు ప్రకారం బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఏరోస్పేస్‌, సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌, బయోటెక్నాలజీ, ఫార్మసీ తదితర విభాగాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 06 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600గా నిర్ణయించారు.

    పీజీఈసెట్‌ పరీక్ష మే 28 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగటివ్‌ మార్కింగ్‌ లేదు. హాల్‌టికెట్లు మే 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

    ముఖ్యమైన తేదీలు:

    ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు: ఫిబ్రవరి 27 – మే 06

    దరఖాస్తుల సవరణ: మే 09 – 10

    రూ.250 ఆలస్య రుసుముతో: మే 09 వరకు

    రూ.1,000 ఆలస్య రుసుముతో: మే 12 వరకు

    రూ.2,500 ఆలస్య రుసుముతో: మే 15 వరకు

    రూ.5,000 ఆలస్య రుసుముతో: మే 18 వరకు

    రూ.10,000 ఆలస్య రుసుముతో: మే 26 వరకు

    హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: మే 19 నుంచి

    రాత పరీక్ష తేదీలు: మే 28 – 31

    అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటనను పరిశీలించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Not just cheetahs: 5 lesser-known wildlife species thriving in Kuno
    తర్వాత ఆర్టికల్
    Donald Trump Signals Fresh Tariffs After US Supreme Court Blow, Warns Countries Against ‘Playing Games’

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి