శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tirumalaladdu : టీటీడీ లడ్డూ కల్తీ నిజమే NDBB నివేదిక స్పష్టం - ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను

    2 days ago

    జగ్గయ్యపేట / విజయవాడ:
    తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ కల్తీ అయిందనేది వాస్తవమని, దీనిని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDBB) తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సామినేని ఉదయభాను మాట్లాడుతూ, టీటీడీకి జంతువుల అవశేషాలతో కలిసిన కల్తీ నెయ్యిని విక్రయించినట్టు NDBB తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టి ప్రముఖ ఆలయాలను సందర్శించి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.

     

    తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణ చెప్పాల్సిన వైసీపీ పార్టీ, అందుకు భిన్నంగా బుకాయించే ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. అసలు డెయిరీ రంగంపై అవగాహన లేని వ్యక్తులకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీలోని అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలను ముందుంచుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రసాయనాల నెయ్యితో లడ్డూలు తయారయ్యాయన్న విషయాన్ని స్వయంగా వెల్లడించారని సామినేని ఉదయభాను తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు, జనసేన పార్టీ కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, పార్టీ నాయకులు ఎస్.ఎల్.ఎన్. మూర్తి, అత్తులూరి పెదబాబు, మద్దిల రామకృష్ణ, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Anushka Sharma hails Smriti Mandhana as 'Queen'; here's why
    తర్వాత ఆర్టికల్
    7 warning signs of structural defects every homeowner should know

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి