శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    There is no plan to abolish the old districts : పాత జిల్లాల రద్దు ఆలోచన లేదు.. పునర్వ్యవస్థీకరణపై మాత్రమే చర్చ – సీఎం రేవంత్‌ రెడ్డి

    2 రోజులు క్రితం

     చెల్పూర్, తొలి ఉదయం:
    పాత జిల్లాలను రద్దు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మాత్రమే ఆలోచన ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజల నుంచి బహిరంగంగా సూచనలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

     

    మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చెల్పూర్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదని ఆయన పునరుద్ఘాటించారు.

     

    విపక్షాల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నమ్మొద్దని సీఎం సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని సహించేది లేదని హెచ్చరిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.   కొంతమంది నేతలకు విషం చిమ్మడమే పనిగా మారిందంటూ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే ఏ నిర్ణయాన్నీ తమ ప్రభుత్వం తీసుకోదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    From Gen Z to Gen Alpha: How parenting styles changed as childhood entered the digital age
    తర్వాత ఆర్టికల్
    Despite defeat in T20 WC opener, Nepal earn world cricket's plaudits

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి