శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana State AIDS Control Society (TSACS) : నిబంధనలకు విరుద్ధమైన బదిలీలపై హైకోర్టు ఆదేశాలు – అమలు చేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి

    1 hour ago

    తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (టీజీశాక్స్‌) పరిధిలో జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన వ్యవహారం వివాదాస్పదమైంది. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (న్యాకో) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల పరిధిలోని జిల్లాల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను బదిలీ చేయకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ అప్పటి టీశాక్స్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఈ అంశంపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం నిబంధనల మేరకు బదిలీలు చెల్లవని స్పష్టం చేస్తూ వారిని తిరిగి వారి మొదటి స్థానాలకు పంపాలని ఆదేశించింది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించి, బదిలీ అయిన ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు తిరిగి పంపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup Super 8: Rabada, Ngidi, Bosch run through WI line-up; seventh wicket falls
    తర్వాత ఆర్టికల్
    Viral video shows Delhi auto driver allegedly offering illegal services to foreign tourist; social media demands action

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి