శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 52 లక్షల ఓటర్లకు కీలక రోజు

    18 hours ago

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,981 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కలిపి మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లకు 2,225 మంది పోటీ పడుతుండగా, కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అలాగే 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు 10,719 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

     

    రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటు వేయడానికి ఓటర్ ఐడి, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఓటర్ స్లిప్‌లను ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని Voter Portal ద్వారా లేదా ‘T-Poll’ మొబైల్ యాప్ ద్వారా, అలాగే 92400 21456 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా పొందవచ్చు. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, సుమారు 41,773 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Billionaire Rihanna spotted grocery shopping - WATCH
    తర్వాత ఆర్టికల్
    TOI Exclusive | Coming soon: A rebel wrestling league by the rebels

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి