శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana government-run Employee Health Scheme (EHS) : ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. త్వరలో ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం’

    17 hours ago

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్య పథకంలోని లోపాలను సవరించి త్వరలో కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో, ఇతర ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకానికి ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ఏర్పాటు చేయనున్నారు.

    ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నగదు రహిత వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉద్యోగుల హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఉద్యోగులు ముందుగా తమ జేబు నుంచి ఖర్చు చేసి, తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. అయితే పూర్తి మొత్తం తిరిగి రాకపోవడం కూడా సమస్యగా మారింది. కొత్త పథకంలో ఉద్యోగుల బేసిక్ వేతనంలో ఒకటిన్నర శాతం వరకు భాగస్వామ్యం ఉండనుంది. ఉదాహరణకు రూ.50,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగి నెలకు సుమారు రూ.750 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ఇన్సూరెన్స్ విధానంలో అమలు చేయాలనుకున్నా, చివరకు ట్రస్టు విధానంలోనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే కొనసాగనుందని అధికారులు తెలిపారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup: Afghanistan win the toss, opt to bat against South Africa
    తర్వాత ఆర్టికల్
    Asian stocks today: Markets inch higher ahead of US economic and job data; HSI adds 97 points, Kospi flat

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి