శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Telangana Assembly Sessions to Begin from the 26th తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 26 నుంచి ప్రారంభం.. 28న 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం

    15 hours ago

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా, 28న 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశముందని సమాచారం. బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి.

    అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్ హామీల అమలుపై దృష్టి సారించింది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్‌ను రూ.4,000కు పెంపు వంటి కీలక ప్రకటనలు బడ్జెట్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుండగా, బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ బడ్జెట్‌కు రాజకీయ ప్రాధాన్యత కూడా పెరిగింది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    AI boost! Tata Group announces partnership with OpenAI; TCS stock rises around 2%
    తర్వాత ఆర్టికల్
    T20 WC LIVE: Italy lose early wickets in 166 chase in Kolkata

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి