శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Team India Enters T20 World Cup Semi-Finals టీ20 ప్రపంచకప్ 2026: సెమీస్‌లోకి టీమిండియా

    2 hours ago

    ICC Men's T20 World Cupలో టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. Eden Gardens వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో India 5 వికెట్ల తేడాతో West Indiesపై ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో మార్చి 5న ముంబైలో England తో సెమీఫైనల్‌లో తలపడనుంది.

     

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. షై హోప్ (32), రోస్టన్ చేజ్ (40) శుభారంభం ఇవ్వగా, చివర్లో రోవ్‌మన్ పావెల్ (34*), జేసన్ హోల్డర్ (37*) అజేయ భాగస్వామ్యంతో స్కోరును భారీగా చేర్చారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ దక్కించుకున్నారు.

     

    లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా, వన్‌డౌన్‌గా వచ్చిన Sanju Samson అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97* పరుగులు చేసిన శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా (17)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 19.2వ ఓవర్‌లో మిడ్-ఆన్ మీదుగా కొట్టిన భారీ షాట్‌తో విజయం ఖరారైంది. గెలుపు అనంతరం మైదానంలో మోకాళ్లపై కూర్చొని దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన శాంసన్ భావోద్వేగ క్షణాలు అభిమానులను కట్టిపడేశాయి. ఈ విజయంతో గ్రూప్-1 నుంచి భారత్ సెమీస్ బెర్తును సగర్వంగా ఖాయం చేసుకుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Rajpal Yadav says, 'I am a man of Rs 1500 crores'
    తర్వాత ఆర్టికల్
    Zimbabwe's boisterous fans bring Arun Jaitley Stadium to life

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి