శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    TDP leader koganti Babu : అంబటి రాంబాబుపై తక్షణ చర్యలు తీసుకోవాలి – కోగంటి బాబు

    5 రోజులు క్రితం

    కంచికచర్ల, జనవరి 31 (తొలి ఉదయం):

    రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ల సంఘం ఉపాధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు డిమాండ్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుకు అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

     

    శనివారం కంచికచర్ల పట్టణంలో టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమం కోగంటి బాబు ఆధ్వర్యంలో జరిగింది.

     

    ఈ సందర్భంగా కోగంటి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ఆదర్శవంతమైన నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.

     

    రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేకే ఇటువంటి నీచ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని కోగంటి బాబు ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీని ఓడించినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.

     

    ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్న ఆయన, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Budget 2026: Bharat Vistaar AI Platform Launched To Support Indian Farmers
    తర్వాత ఆర్టికల్
    Breaking News: Nirmala Sitharaman to Present Union Budget 2026-27 Focused on Reform Express

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి