శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tata Groups : టాటా స్టీల్‌కు లాభాల జోరు

    3 రోజులు క్రితం

    ముంబై:
    టాటా గ్రూప్‌కు చెందిన దిగ్గజ ఉక్కు సంస్థ టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రికార్డు స్థాయిలో 723 శాతం పెరిగి రూ. 2,689 కోట్లుగా నమోదైంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ. 327 కోట్లుగానే ఉండగా, ఈసారి భారీ వృద్ధి సాధించడం గమనార్హం.

    ఆదాయంలోనూ వృద్ధి

    సమీక్షా త్రైమాసికంలో టాటా స్టీల్ కార్యకలాపాల ఆదాయం రూ. 57,002 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో ఆదాయం రూ. 53,648 కోట్లుగా ఉండగా, సుమారు 6 శాతం వృద్ధి నమోదైంది. కొంతకాలంగా టాటా గ్రూప్‌కు చెందిన పలు కంపెనీలు బలహీన ఫలితాలను ప్రకటిస్తూ, వాటి షేర్లు కూడా భారీగా పడిపోతున్న తరుణంలో టాటా స్టీల్ ఫలితాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.

    త్రైమాసిక ప్రాతిపదికన తగ్గిన లాభాలు

    అయితే, కిందటి త్రైమాసికంతో పోలిస్తే లాభాల్లో కొంత తగ్గుదల నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 3,102 కోట్ల నికర లాభం నమోదు కాగా, మూడో త్రైమాసికంలో ఇది 13 శాతం తగ్గింది.
    ఇదే సమయంలో ఆదాయం కూడా రెండో త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం తగ్గింది. Q2లో టాటా స్టీల్ ఆదాయం రూ. 58,689 కోట్లుగా ఉంది.

    భారత్, విదేశీ కార్యకలాపాల వివరాలు

    టాటా స్టీల్ ఇండియా ఆదాయం రూ. 35,725 కోట్లుగా నమోదైంది. ఈ విభాగంలో EBITDA రూ. 8,291 కోట్లుగా ఉంది.
    క్రూడ్ స్టీల్ ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగి 6.34 మిలియన్ టన్నులకు చేరింది.

    నెదర్లాండ్స్‌లోని టాటా స్టీల్ కార్యకలాపాల్లో ఆదాయం 1,354 మిలియన్ యూరోలుగా నమోదు కాగా, EBITDA 55 మిలియన్ యూరోలుగా ఉంది.

    రుణాలు తగ్గింపు, క్యాప్‌ఎక్స్ పెంపు

    మూలధన వ్యయాల (Capex) కోసం కంపెనీ రూ. 3,291 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. నికర రుణాలు రూ. 5,206 కోట్లు తగ్గి రూ. 81,834 కోట్లుగా నమోదయ్యాయి.

    షేరు ధర పరిస్థితి

    బలమైన ఫలితాలున్నప్పటికీ, టాటా స్టీల్ షేరు ధర ఒత్తిడికి లోనైంది. శుక్రవారం రోజున ఈ స్టాక్ 0.63 శాతం నష్టంతో రూ. 196.51 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.46 లక్షల కోట్లుగా ఉంది.

    స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 202.99 కాగా, కనిష్ఠ ధర రూ. 125.30గా నమోదైంది.

    గత 5 రోజుల్లో: 6%కు పైగా పెరుగుదల

    గత ఒక నెలలో: దాదాపు 6% వృద్ధి

    6 నెలల్లో: 23%కు పైగా లాభం

    ఈ ఏడాది ఇప్పటివరకు: 8%కు పైగా పెరుగుదల

    ఏడాది కాలంలో: 42% రిటర్న్స్

    ఐదేళ్లలో: 186%కు పైగా రాబడులు

    మొత్తంగా చూస్తే, టాటా స్టీల్ వార్షిక ప్రాతిపదికన బలమైన ఫలితాలు నమోదు చేసినప్పటికీ, త్రైమాసిక ప్రాతిపదికన కొంత ఒత్తిడి కొనసాగుతుండటం షేరు ధరపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 WC: Abrar Ahmed gets rid of Colin Ackermann
    తర్వాత ఆర్టికల్
    No duty concessions on sensitive grains, fruits, dairy: Highlights from India-US trade deal

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి