శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Tamannaah did not charge ANY MONEY for 'O Romeo' : స్నేహం కోసం పారితోషికం వద్దన్న తమన్నా

    11 hours ago

    సినిమా అంటేనే పక్కా కమర్షియల్ రంగమని చాలామంది భావిస్తుంటారు. కానీ సినీ పరిశ్రమలో కూడా స్నేహం, అనుబంధానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు ఉన్నారని అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. అలాంటి కోవలోకే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేరుతుందని ప్రముఖ దర్శక, నిర్మాత విశాల్ భరద్వాజ్ వెల్లడించారు.

     

    సాధారణంగా తమన్నా ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్న ప్రచారం ఉంది. అంతేకాదు, ఆమె స్పెషల్ సాంగ్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కూడా ఇండస్ట్రీలో బలంగా ఉంది. గతంలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ ఉన్న సినిమాలు మంచి విజయాలను కూడా సాధించాయి. అయితే ఇటీవల విడుదలకు సిద్ధమవుతున్న ఓ హిందీ సినిమాలో మాత్రం తమన్నా పారితోషికం తీసుకోకుండానే నటించిందని విశాల్ భరద్వాజ్ తెలిపారు. అదే ‘ఓ రోమియో’ (O Romeo) చిత్రం. ఈ సినిమాలో షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రీ, నానా పటేకర్ ప్రధాన పాత్రల్లో నటించగా, ‘ట్వెల్త్ ఫెయిల్’ ఫేమ్ విక్రాంత్ మస్సే మరియు తమన్నా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు.

     

    దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో ఉన్న స్నేహం, అనుబంధం కారణంగానే విక్రాంత్ మస్సే, తమన్నా ఇద్దరూ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాలో నటించారని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా నిర్మించారు. ‘ఓ రోమియో’ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.  డబ్బులకే ప్రాధాన్యం ఇచ్చే నటిగా విమర్శించే వారికి తమన్నా ఈ నిర్ణయంతో గట్టి షాక్ ఇచ్చిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్నేహం కోసం పారితోషికాన్ని పక్కనపెట్టి నటించడం ద్వారా తాను కేవలం కమర్షియల్ స్టార్ మాత్రమే కాదని తమన్నా మరోసారి నిరూపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Why Tusshar Kapoor’s Real-Estate choices reflect a growing investor mindset in India
    తర్వాత ఆర్టికల్
    Sudip Gharami's 299 powers Bengal to dominant Ranji semifinal entry

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి