శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Swarnandhra : స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రకు ప్రజలు–అధికారుల సమన్వయం అవసరం : జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ

    1 వారం క్రితం

     జనవరి 24 (తొలి ఉదయం):

    స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ శా పిలుపునిచ్చారు.

     

    కంచికచర్ల గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి **స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర, జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర** థీమ్ కార్యక్రమంలో భాగంగా, పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

     

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, **సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక మహమ్మారి లాంటిదని**, అది తక్షణ ప్రభావం చూపకపోయినా నెమ్మదిగా ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పర్యావరణాన్ని విస్తృతంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని, క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.

     

    సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై ఆలోచించాల్సిన అవసరం ఉందని, ప్లాస్టిక్ వాడే వారిపై పంచాయితీలు జరిమానాలు విధించే అధికారం ఉందన్నారు. పంచాయితీల ద్వారా ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను సేకరించి, వాటి బదులుగా ప్రజలకు అవసరమైన సరుకులు పంపిణీ చేసే విధంగా **‘స్వచ్ఛ రథ్’** ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామానికి స్వచ్ఛ రథ్ వచ్చినప్పుడు ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేసి అవసరమైన సరుకులు పొందాలని సూచించారు.

     

    చెత్త నుండి సంపద కేంద్రాల ద్వారా సంపద సృష్టించి, స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ వన్‌గా నిలపడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను **క్లీన్ అండ్ గ్రీన్ జిల్లాగా** తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

     

    తడి చెత్త నుంచి తయారైన వర్మీ కంపోస్ట్‌ను రైతులకు విక్రయించడం, పారిశుద్ధ్య కార్మికులకు పోస్టల్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించడం, స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రీన్ అంబాసిడర్లుగా తడి–పొడి చెత్తను వేరు చేసి అందిస్తున్న గృహిణులకు సర్టిఫికెట్లు అందజేసి, పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు.

     

    అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన దుస్తులు, గ్లౌజులు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. మహిళల నుంచి ప్లాస్టిక్ పేపర్లు, అట్ట పెట్టెలు కొనుగోలు చేసి, స్వచ్ఛ రథం ద్వారా అందించే నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థులతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

     

    ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె. బాలకృష్ణ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారిణి పి. లావణ్య కుమారి, డివిజనల్ లెవల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు యం. లక్ష్మీ కుమారి, పి. శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి సత్యనారాయణ, సర్పంచ్ వేల్పుల సునీత, కంచికచర్ల ఎంపీడీవో వెంకటేశ్వర రావు, తహసీల్దార్ నరసింహారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో నానిబాబు, పంచాయతీ కార్యదర్శులు ప్రియాంక, సుబ్రమణ్యం, సచివాలయ, శానిటేషన్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Parents are asking AI about their kids: Here’s why experts say "pause"
    తర్వాత ఆర్టికల్
    IND vs NZ U19 WC: India beat New Zealand by seven wickets

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి