శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sub registration office : జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు – త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సబ్ రిజిస్ట్రార్

    1 week ago

    కాకినాడ (తొలి ఉదయం): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. సబ్ రిజిస్ట్రార్  వెంకట రామారావు  ఆధ్వర్యంలో త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, కార్యాలయ ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మైమరిపించింది.

     

    ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ వెంకట రామారావు మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడమే గణతంత్ర దినోత్సవ ఆత్మసారం అని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శక పద్ధతిలో సేవలు అందించడం ప్రధాన లక్ష్యమని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా భూ లావాదేవీలు, డాక్యుమెంట్ నమోదు ప్రక్రియ మరింత సులభతరం అయ్యిందని వివరించారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు పొందడం, సమయం ఆదా చేయడం, అవినీతి నివారణలో ఈ విధానం ఎంతగానో దోహదపడుతోందని పేర్కొన్నారు.

     

    సబ్ రిజిస్ట్రార్ వెంకట రామారావు ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలను కాపాడే విధంగా కృషి చేయాలనూ, గణతంత్ర దేశ పౌరులుగా మన బాధ్యతలను గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Clock ticking for Samson: Can he fix his batting issues before T20 WC?
    తర్వాత ఆర్టికల్
    Who is Prathamesh Kadam? Influencer passes away, creators mourn

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి