శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sreerama : శ్రీరాముడు సకల గుణాభిరాముడు.

    3 వారాలు క్రితం


    శ్రీరాముడు సకల గుణాభిరాముడు. “రామా… శ్రీరామా ” అని మనసారా పలికిన క్షణమే బాధలన్నీ కరిగిపోతాయి. నేటికీ రామాలయం లేని ఊరు అరుదు. శ్రీరాముడు మనకు కేవలం దేవుడు మాత్రమే కాదు… జీవితానికి ఆదర్శం. ఆయన జీవితం ప్రతి మనిషికీ ఒక మహత్తర సందేశం.  అరణ్యవాస కాలంలో శ్రీరాముడు ఎందరో దీనులను కరుణించి పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. అహల్యకు శాపవిమోచనం కలిగించి ఆమె జీవితాన్ని పవిత్రం చేశాడు. శబరి భక్తిని మెచ్చి ఆమెకు స్వర్గలోక ప్రాప్తి కలిగించాడు. భక్తి ఉంటే చాలు, అర్హతలు అడగని కరుణామూర్తి ఆయన.

    సీతాన్వేషణలో ఉన్న సమయంలో అడవిలో ఒక దయనీయ దృశ్యం కనిపించింది. రెక్కలు విరిగి, కొన ఊపిరితో ఉన్న జటాయువు. ఆ స్థితిని చూసిన వెంటనే శ్రీరామునికి జరిగిన సంగతంతా అర్థమైంది. సీతాదేవిని రావణుని చెర నుంచి రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ పక్షి త్యాగాన్ని గుర్తించి రాముడు కరుణతో కదిలిపోయాడు.

    శ్రీరాముని దర్శనంతోనే జటాయువు కన్నులు మూసింది. రాముడు ఆ పక్షికి తన తండ్రిలా దహన సంస్కారాలు నిర్వహించి,
    “నా అనుజ్ఞతో ఉత్తమ లోకాలకు వెళ్లుము” అని వరమిచ్చాడు.
    ఆ విధంగా శ్రీరాముని కరుణ వలన జటాయువుకు పుణ్యలోక ప్రాప్తి కలిగింది.

    అంతే కాదు… జంతువులలో అత్యల్పమైన ప్రాణి అయిన ఉడుత కూడా శ్రీరాముని కరుణకు పాత్రమైంది. లంకకు వెళ్లేందుకు సముద్రంపై వారధి నిర్మిస్తున్నప్పుడు వానరులు రాళ్లు, రప్పలు మోస్తూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ చేతనైన సేవ చేస్తున్నారు.

    అది గమనించిన చిన్న ఉడుత—
    “నా వంతు సేవ నేను చేయాలి” అని నిర్ణయించుకుంది.
    ఇసుకలో దొర్లి తన శరీరానికి అంటుకున్న ఇసుక రేణువులను వారధి నిర్మాణ స్థలంలో దులిపి సముద్రంలో వేసేది. పదే పదే అటూ ఇటూ తిరుగుతూ తన చిన్న సేవను అర్పించింది.

    ఆ దృశ్యాన్ని చూసిన శ్రీరాముని హృదయం ద్రవించింది. ఉడుతను తన చేతిలోకి తీసుకుని ప్రేమగా దాని వీపుపై నిమిరాడు. ఆ స్పర్శకు గుర్తుగా ఉడుత వీపుపై మూడు చారలు నేటికీ ఉన్నాయి. ఆ ఉడుత జాతికి కూడా శ్రీరాముని కరుణా కటాక్షం వలన ఉన్నత లోక ప్రాప్తి కలిగింది.

    రామాయణం ఈ జగత్తు ఉన్నంత వరకు, శ్రీరాముని కథ చదువబడుతున్నంత వరకు వానరులను, జటాయువును, ఉడుతను మనం గుర్తు చేసుకోకుండా ఉండలేం. అడవుల్లో అనామకంగా సంచరించిన వానరులకు కూడా శ్రీరాముని కరుణ వలన చిరస్మరణీయ స్థానం లభించింది.

    రామ–రావణ యుద్ధంలో మరణించిన వారికీ శ్రీరాముని కరుణా కటాక్షం వలన ఉత్తమ గతి లభించింది.
    ఓ జటాయువు, ఓ ఉడుత వంటి జంతువులే త్యాగంతో పుణ్యలోక ప్రాప్తి పొందితే—
    జ్ఞానం కలిగిన మనుషులు శ్రీరామ నామస్మరణ చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఆలోచించాలి.

    అందుకే జీవితాంతం మాత్రమే కాదు…
    ప్రతి నిత్యం, ప్రతి క్షణం—

    “శ్రీరామ! జయ రామ! జయ జయ రామ!”

    అనే నామస్మరణతో
    ఆ కరుణామూర్తి శ్రీరాముని కటాక్షానికి
    ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని ఆశిద్దాం.

    శ్రీరామ జయరామ జయజయరామ!! 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Emraan addresses hypermasculinity in films: 'Woke brigade...'
    తర్వాత ఆర్టికల్
    'It's not a great feeling': Virat Kohli speaks out on crowd cheers after teammate's wicket

    సంబంధిత భక్తి శిఖరం అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి