శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sovereign Gold : సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన.. ముందస్తు విమోచన ధర రూ.15,374

    3 days ago

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సావరిన్ గోల్డ్ బాండ్స్ 2020-21 సిరీస్–XIకు సంబంధించిన ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ (ముందస్తు విమోచన) ధరను ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 9న జారీ చేసిన ఈ గోల్డ్ బాండ్స్‌కు ఐదేళ్లు పూర్తవడంతో, ముందుగానే విత్‌డ్రా చేసుకునే ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ ఈ ధరలను నిర్ణయించింది. సాధారణంగా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కాలపరిమితి 8 సంవత్సరాలు అయినప్పటికీ, ఐదేళ్ల తర్వాత ముందస్తు విమోచనకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తూ, ఇప్పుడు వాటిని రిడీమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

    2020-21లో ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో గోల్డ్ బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ.4,912గా ఉండగా, ఆన్‌లైన్‌లో అప్లై చేసి డిజిటల్ చెల్లింపు చేసిన వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌తో రూ.4,862కే లభించింది. తాజా ప్రకటన ప్రకారం, ఈ బాండ్ల ముందస్తు విమోచన ధరను గ్రాముకు రూ.15,374గా నిర్ణయించింది. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించిన ఫిబ్రవరి 4, 5, 6 తేదీల బంగారం ధరల మూడు రోజుల సగటు ఆధారంగా ఈ రేటును ఖరారు చేశారు. ఈ కాలంలో బంగారం ధర భారీగా పెరగడంతో, గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ లభించనున్నాయి.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs USA LIVE: SKY show powers India to 161/9 in 20 overs
    తర్వాత ఆర్టికల్
    IND vs USA LIVE: Arshdeep Singh strikes as India take two early wickets

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి