శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    South Africa Vs Afghanistan T20 Super Over : సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో అప్ఘనిస్తాన్ విజయం… సఫారీలపై సంచలన గెలుపు

    8 hours ago

    ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా – అప్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరు ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరకు సూపర్ ఓవర్‌లో అప్ఘనిస్తాన్ విజయం సాధించి సంచలనం సృష్టించింది.

    టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎంచుకోగా, సౌతాఫ్రికా బ్యాటర్లు బలమైన ఆరంభం ఇచ్చారు. కెప్టెన్ ఎయిడెన్ మర్కరమ్ త్వరగా అవుటైనా, క్వింటన్ డికాక్ – ర్యాన్ రికెల్టన్ జట్టును నిలబెట్టారు. ఇద్దరూ కలిసి కేవలం 61 బంతుల్లో 114 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. రికెల్టన్ 28 బంతుల్లో 61 (5 ఫోర్లు, 4 సిక్సర్లు), డికాక్ 41 బంతుల్లో 59 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసి అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. సఫారీల స్కోర్ 200 దాటుతుందనుకున్న సమయంలో ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.

    లక్ష్య ఛేదనలో అప్ఘనిస్తాన్ కూడా ధైర్యంగా పోరాడింది. చివరి ఓవర్‌లో మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా మారింది. నూర్ అహ్మద్ సిక్సర్లతో మ్యాచ్‌ను అప్ఘనిస్తాన్ వైపు తిప్పాడు. మొదటి బంతికే అవుట్ అయినా అది నో బాల్‌గా తేలడంతో ఆశలు చిగురించాయి. అదే ఓవర్‌లో రబాడా మరో నో బాల్ వేయడం, చివర్లో రనౌట్‌తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది.   దాంతో సూపర్ ఓవర్ నిర్వహించగా, అక్కడ అప్ఘనిస్తాన్ చల్లగా ఆడి విజయం ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరిత పోరులో అప్ఘనిస్తాన్ గెలుపుతో టోర్నీలో కొత్త ఉత్సాహం నెలకొంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ENG vs WI, T20 WC: Sherfane Rutherford rescues West Indies against England
    తర్వాత ఆర్టికల్
    Dhanush to Sreeleela:'D55' cast and crew salary details

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి