శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Singareni CoalProduction : సింగరేణిపై చీకట్లు? ఉత్పత్తి లక్ష్యాలు, బకాయిల భారం మధ్య భవిష్యత్‌పై ఆందోళనలు

    1 hour ago

    రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన Singareni Collieries Company Limited (సింగరేణి) తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు), ఒడిశాలోని నైనీ బ్లాక్ టెండర్లపై అవినీతి ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, జనవరి 31 నాటికి 54 మిలియన్ టన్నులకూ చేరుకోలేదని సమాచారం. ఫిబ్రవరి, మార్చిలో 22 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నైనీ బ్లాక్ నుంచి రావాల్సిన 4 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సౌకర్యాల లేమి, కోల్ లింకేజీ ఏర్పాటులో వైఫల్యంతో నిలిచిపోయింది. బొగ్గు నాణ్యత, మార్కెటింగ్ సమస్యల కారణంగా మార్కెట్ డిమాండ్ కూడా తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

     

    ఇక ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు విక్రయించిన బొగ్గు, విద్యుత్‌కు సంబంధించిన బకాయిలు కలిపి దాదాపు రూ.50 వేల కోట్లకు చేరినట్లు సమాచారం. రెండేళ్లలోనే బకాయిలు రెట్టింపు కావడం సంస్థపై భారీ భారం మోపుతోంది. వేతనాల చెల్లింపులు కూడా కష్టంగా మారే పరిస్థితి ఉందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లో సోలార్ ప్రాజెక్టులు, కర్ణాటకలో బంగారం తవ్వకాలు, రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ వంటి కొత్త రంగాల్లో విస్తరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అంతర్గత సమస్యలు పరిష్కరించకుండా విస్తరణపై దృష్టి పెట్టడం సంస్థ భవిష్యత్‌ను మరింత సంక్లిష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Shadab Khan's 'Pakistan will play the final' claim goes viral - WATCH
    తర్వాత ఆర్టికల్
    Experts Predicting Bitcoin (BTC) To Hit New Highs, While MUTM Token Can Go 10x First

    సంబంధిత తెలంగాణ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి