శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sensex and Nifty Closing Updates: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఒడిదుడుకుల తర్వాత లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    2 గంటలు క్రితం

    అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.

    గత ముగింపు 82,814తో పోల్చితే దాదాపు 100 పాయింట్ల లాభంతో ప్రారంభమైన BSE Sensex ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైంది. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చితే 500 పాయింట్లకు పైగా ఎగబాకి, చివరకు 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద ముగిసింది. అదే సమయంలో NIFTY 50 141 పాయింట్లు పెరిగి 25,713 వద్ద స్థిరపడింది.   సూచీల్లో Indian Bank, Cummins India, Siemens Limited, Adani Ports, Bharat Forge షేర్లు లాభాలు ఆర్జించాయి. మరోవైపు IDFC First Bank, UPL Limited, AU Small Finance Bank, Dixon Technologies, Coforge షేర్లు నష్టాల్లో ముగిశాయి.  NIFTY Bank 92 పాయింట్లు లాభపడగా, NIFTY Midcap 100 258 పాయింట్లు తగ్గింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 90.88 వద్ద కొనసాగుతోంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Yash in dual role? 'Toxic' BTS visuals spark fresh theories
    తర్వాత ఆర్టికల్
    Stock market today: Nifty50 settles at 25,713; BSE Sensex climbs nearly 480 points to close at 83,294

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి