శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ‘Saraswathi’ Pre-Release Event ‘సరస్వతి’ ప్రీ-రిలీజ్ వేడుకలో వరలక్ష్మి భావోద్వేగం.. రాధికకు కృతజ్ఞతలు

    1 గంట క్రితం

    Saraswathi చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో అర్థవంతంగా ఉంటుందని నటి Varalaxmi Sarathkumar తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌, ప్రియమణి తమ అద్భుత నటనతో సినిమాకు ప్రాణం పోశారని చెప్పారు. మంచి సందేశాన్ని ఇస్తూనే ఆద్యంతం అలరించే చిత్రం ఇదని ఆమె పేర్కొన్నారు. దోశ డైరీస్ బ్యానర్‌పై వరలక్ష్మి శరత్‌కుమార్‌, పూజ శరత్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో వరలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. “సొంత తల్లి కాకపోయినా ప్రతిక్షణం నాకు మార్గనిర్దేశం చేస్తూ అండగా నిలిచిన Radhika Sarathkumar గారి గురించి ఎంత చెప్పినా తక్కువే” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

     

    ఈ కార్యక్రమంలో నటుడు R. Sarathkumar మాట్లాడుతూ “‘సరస్వతి’ లాంటి కథ తప్పకుండా చెప్పాల్సిందే. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రేమను అందుకుంటుంది” అన్నారు. రాధికా శరత్‌కుమార్ మాట్లాడుతూ “ఆడవారికి ధైర్యాన్నిచ్చే కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి కథను వరలక్ష్మి తెరకెక్కించడం గర్వకారణం” అని తెలిపారు. వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్‌కుమార్ మొదట అంగీకరించలేదని, తరువాత కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఒప్పుకున్నారని చెప్పారు. తమిళం కంటే తెలుగులో చేస్తే మంచి గుర్తింపు వస్తుందని, ఆ పరిశ్రమే నీకు సరైన వేదిక అవుతుందని తాను సూచించానని రాధిక వెల్లడించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Inside Tom Cruise’s lavish Florida skyview penthouse
    తర్వాత ఆర్టికల్
    Gold price prediction today: How will gold prices react this week to Middle East tensions? Key levels to watch out

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి