శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sankranthi 2027 Big Movies : టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సంక్రాంతి క్లాష్‌కు సిద్ధం

    1 day ago

    మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్… తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా పేరొందిన ఈ నలుగురు సీనియర్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, 60 ప్లస్ వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరోలు… ఇప్పుడు ఒకే సీజన్‌లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

    టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే సినిమా పండగ. బాక్సాఫీస్‌కు అతి పెద్ద సీజన్. కంటెంట్ ఎలా ఉన్నా, పండగ సీజన్‌లో సినిమాలకు కలెక్షన్ల భయం ఉండదనే నమ్మకంతో చాలా మంది నిర్మాతలు ఈ సమయాన్నే టార్గెట్ చేస్తుంటారు. ప్రతీ ఏడాది సంక్రాంతికి కనీసం నాలుగు సినిమాలను ప్రేక్షకులు ఆదరించే శక్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది అయితే ఏకంగా ఐదు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

    ఈ నేపథ్యంలోనే 2027 సంక్రాంతి మరింత హాట్‌గా మారుతోంది. ఈసారి ఏకంగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సంక్రాంతి రేసులో ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తాజా చిత్రాన్ని పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్‌తో వెంకీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    మరోవైపు మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘మెగా 158’ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఫ్లాష్ మాన్ స్పీడ్‌తో సినిమాలు పూర్తి చేసే నటసింహం బాలకృష్ణ కూడా మరోసారి పెద్ద పండక్కే బాక్సాఫీస్ దగ్గర సందడి చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 111’ సినిమాను ఫెస్టివల్ టార్గెట్‌గా రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

    ఇప్పుడీ నలుగురు సీనియర్ స్టార్ హీరోలు ఒకే సంక్రాంతికి వస్తే…  టాలీవుడ్ బాక్సాఫీస్‌కి అసలైన పండగ ఖాయం అనే మాట సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup: New Zealand show they are ready for long haul
    తర్వాత ఆర్టికల్
    T20 World Cup: Italy chase cricket glory in historic WC debut vs Scotland

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి