శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ₹1,000 crore Rocket Research Center : నెల్లూరులో రూ.1000 కోట్ల రాకెట్ పరిశోధనా కేంద్రం.. ఏపీకి స్పేస్ రంగంలో మరో అడుగు

    9 hours ago

    ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష రంగానికి కొత్త ఊపునిచ్చే భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబడింది. నెల్లూరు జిల్లాలో రూ.1000 కోట్ల పెట్టుబడితో రాకెట్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది. దత్తలూరు మండలంలో ఈ రాకెట్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం రాచవారిపల్లి, బ్రహ్మశ్వరం రెవెన్యూ పరిధిలోని భూములను జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పరిశీలించారు. ఇప్పటికే గతేడాది ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థతో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త పెట్టుబడితో రాష్ట్రంలో అంతరిక్ష పరిశోధనలకు మరింత బలం చేకూరనుంది.

     

    ఈ రాకెట్ పరిశోధనా కేంద్రం ద్వారా రాకెట్ భాగాల తయారీ, సాంకేతిక పరిశోధనలు, అంతరిక్ష సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దేశానికి ప్రధాన రాకెట్ ప్రయోగ కేంద్రంగా కొనసాగుతోంది. ఇస్రో చేపట్టే ఎక్కువ భాగం ప్రయోగాలు అక్కడి నుంచే జరుగుతున్నాయి. దేశంలో అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తుండగా, ప్రైవేట్ సంస్థలు కూడా ఇస్రోతో కలిసి రాకెట్ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయి.

     

    అదేవిధంగా కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌లో స్పేస్‌పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్టు ‘స్పేస్ సిటీ’ ప్రాజెక్ట్‌లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ స్పేస్ సిటీ ద్వారా ప్రైవేట్ లాంచ్ మిషన్లకు మద్దతు లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది. స్పేస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఏపీని అంతరిక్ష పరిశ్రమలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. నెల్లూరులో ప్రతిపాదిత రాకెట్ పరిశోధనా కేంద్రం ఆ దిశగా కీలక మైలురాయిగా నిలవనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    IND vs NAM, T20 WC: Axar adds to spin squeeze after Chakravarthy strikes thrice; Namibia five down
    తర్వాత ఆర్టికల్
    CBIC to launch Eligible Manufacturer-Importer scheme by March 1; how it could ease customs compliance

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి