శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Right to Information యాక్ట్ : సమాచార హక్కు చట్టం జాతీయ కార్యదర్శిగా డా. దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి నియామకం

    5 days ago

    హైదరాబాద్:

    సమాచార హక్కు చట్టం (RTI) జాతీయ కార్యదర్శిగా ప్రముఖ న్యాయవాది **డాక్టర్ దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి** గారిని నియమిస్తూ సమాచార హక్కు చట్టం జాతీయ చైర్మన్ **డాక్టర్ చంటి ముదిరాజ్** గారు ఉత్తర్వులు జారీ చేశారు.

     

    ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జాతీయ కార్యదర్శి డా. దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, న్యాయవాదిగా తన అనుభవాన్ని ఉపయోగించి అవినీతి, అక్రమాలను వెలికితీసి న్యాయస్థానాల ద్వారా అరికట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి నిరుపేద, సామాన్య ప్రజలకు న్యాయ సలహాలు, సేవలు అందించడమే తన లక్ష్యమని చెప్పారు.

     

    ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద ప్రజలకు సక్రమంగా అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలయ్యే వరకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు ఆర్టీఐ చట్టంపై విస్తృత అవగాహన కల్పిస్తానని పేర్కొన్నారు.

     

    విద్య, వైద్య రంగాల్లో ఉన్న లోపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తానని, మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించడంలో చురుకుగా వ్యవహరిస్తానని తెలిపారు.

     

    ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కాపాడటం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటం, ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి మరియు అసమర్థ అధికారులను ఆధారాలతో నిరూపించి సమాజానికి తెలియజేయడం తన ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలపై రాజీ లేని పోరాటాన్ని చట్టబద్ధమైన విధానాల ద్వారా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

     

    ప్రతి గ్రామంలో రెవెన్యూ, అటవీ భూములు, చెరువుల శిఖాలు, బంచరాయి, బంజరు, పోరంబోకు, గ్రామకంఠం భూముల లెక్కలు తేల్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు నివేదికలు సమర్పిస్తూ, ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తానని చెప్పారు.

     

    సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వారా ప్రజల వినతులు, విజ్ఞప్తులపై పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అలాగే సమాచార హక్కు చట్టానికి రాజకీయ పార్టీలతో గానీ, ఇతర సంస్థలతో గానీ ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేశారు.

     

    మానవ హక్కులను కాపాడటం, మానవ సంబంధాలను మెరుగుపరచడం, మానవత్వాన్ని పంచడమే తమ ప్రధాన ఎజెండా అని డా. దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి విలేకరుల సమావేశంలో తెలిపారు.

     

     

     

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    7 most memorable Grammy moments to rewind before the 2026 awards
    తర్వాత ఆర్టికల్
    Budget-friendly destinations in 2026: 8 Indian places that should be on every traveller’s wish list this year

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి