శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Post Office RD Scheme : నెలకు రూ.100తోనే ప్రారంభం… 5 ఏళ్లలో మంచి రాబడి! పోస్టాఫీస్ RD స్కీమ్‌పై కేంద్ర హామీ

    11 hours ago

    సామాన్య ప్రజలు తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని భద్రంగా పొదుపు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. వాటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ ప్రత్యేకమైనది. నెల నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి, కాల వ్యవధి పూర్తయ్యే సరికి ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందే వీలుండటం ఈ పథకం ప్రత్యేకత. ముఖ్యంగా ఈ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల పూర్తిస్థాయి భద్రత ఉంటుంది.

    ప్రస్తుతం 2026 జనవరి-ఫిబ్రవరి త్రైమాసికానికి ఈ పథకంపై 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు అందుతోంది. కనీసంగా రూ.100తోనే అకౌంట్ ప్రారంభించవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు – ఎంతైనా పొదుపు చేయవచ్చు. మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అవసరమైతే మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంది. వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది.

    ఎంత పెట్టుబడికి ఎంత రాబడి?

    నెలకు రూ.100 చొప్పున 5 సంవత్సరాలు జమ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.6,000 అవుతుంది. దీనిపై సుమారు రూ.1,136 వడ్డీ లభిస్తుంది. మొత్తంగా రూ.7,136 వరకు చేతికి వస్తాయి. అదే పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తే సుమారు రూ.17,085 వరకు లభించే అవకాశం ఉంటుంది.

    నెలకు రూ.500 చొప్పున 5 సంవత్సరాలు జమ చేస్తే పెట్టుబడి రూ.30,000 అవుతుంది. దీనిపై సుమారు రూ.5,680 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.35,680 వరకు లభిస్తుంది. మరో 5 ఏళ్లు కొనసాగిస్తే అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.85,427 వరకు పొందవచ్చు.

    సురక్షితమైన పెట్టుబడి, నెల నెలా చిన్న మొత్తాల్లో సేవింగ్ అలవాటు, తక్కువ రిస్క్ – ఇవన్నీ కలిపి పోస్టాఫీస్ RD స్కీమ్‌ను మధ్యతరగతి, చిన్న ఆదాయ వర్గాల వారికి మంచి ఎంపికగా నిలుపుతున్నాయి.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    T20 World Cup: Ireland start the chase of 183 vs Australia
    తర్వాత ఆర్టికల్
    This city on Earth is closest to space where people struggle to breathe: All about their daily life

    సంబంధిత బిజినెస్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి