kntv
kntv

రెండు నెలలుగా నీటి సమస్య రోడ్డుకెక్కిన కృష్ణా నగర్ వాసులు

1 day ago

 కడప జిల్లా టి .సుండుపల్లి మండలంలోని కృష్ణానగర్‌ వాసులు తాగునీటి సమస్యపై ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా కాలనీలో నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.