kntv
kntv

వనభోజనాలకు ఊరంతా వెళ్లింది.ఇదే అదనుగా దొంగల దాడి!

50 minutes ago

N.Pకుంట మండలం, గౌకనపల్లి గ్రామంలోని ప్రజలు వనభోజనాల కోసం చిన్నా పెద్దా కలిసి బయటకు వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకున్న దుండగులు ఓ ఇంటిని టార్గెట్ చేశారు.తెలూరి బయప్ప, స్వర్గీయ టీ. నాగన్న కుమారుడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటిని జల్లెడ పట్టారు. సుమారు 6 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.30 లక్షల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.