kntv
kntv

తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు.. అధికారిక ఉత్తర్వులు జారీ

2 hours ago

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా, అనంతరం సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా సేవలందించారు.