శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ఎన్టీఆర్ ఆశయాలే మా మార్గదర్శకం: నారా లోకేశ్

    2 వారాలు క్రితం

    హైదరాబాద్, జనవరి 18:
    తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఆశయాలే తమ మార్గదర్శకమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.

    ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ భావన పాలనకు ఆదర్శమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశానికే దిశానిర్దేశం చేశాయని గుర్తు చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, పింఛన్లు వంటి కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే ప్రజాసేవను కొనసాగిస్తూ, తెలుగు ప్రజల అభ్యున్నతికి టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేతకు శ్రద్ధాంజలి ఘటించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Demand for Einstein visa sees a rise: What exactly is this visa offered by the US and who can get it
    తర్వాత ఆర్టికల్
    Parul shares video for Karan Aujla amid CHEATING rumors

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి