శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Pollution : కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు: విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

    1 వారం క్రితం

    విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే అయినా, కాలుష్యాన్ని నియంత్రించడంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధితో పాటు కాలుష్యం పెరిగిందని, ముఖ్యంగా పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామంలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రతి పరిశ్రమ తప్పనిసరిగా 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను అమలు చేయాలని, మొక్కలు నాటడం కేవలం రూపకల్పనకే కాకుండా జీవ వైవిధ్యం పెరిగేలా ఉండాలని అన్నారు. తీర ప్రాంత రక్షణ కోసం తీసుకొచ్చిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పరిశ్రమల సహకారం ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ICC U19 WC: Afghanistan, England join Australia in semifinals
    తర్వాత ఆర్టికల్
    How Siddhesh Lad overcame retirement thoughts to rewrite Ranji records

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి